తాగునీటి కోసం అవస్థలు పడుతున్న గిరిజన ప్రజలు

PPM: కొమరాడ మండలం దేరుపాడు గిరిజన గ్రామంలోని తాగునీటి ట్యాంకు మూలకు చేరింది. ఇటీవల వీచిన భారీగాలులకు విద్యుత్ సరఫరాలో అంత రాయం ఏర్పడడంతో తాగునీటి ట్యాంకులోకి నీటి సర ఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటి కోసం గ్రామంలోని 28 గిరిజన కుటుంబాల వారు అవస్థలు పడుతున్నారు. అలాగే ట్యాంకుకు నీటిని అందించే బావి కూడా ఎండిపోయిందని, తాగునీరు సక్రమంగా అందడం లేదని తెలిపారు.