'హిందువులు కుటుంబ నియంత్రణ పాటించవద్దు'
NZB: ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందువులు కుటుంబ నియంత్రణ పాటించవద్దని, జనాభా పెంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని, అందుకు ధీటుగా హిందూ జనాభాను కూడా పెంచాలని పేర్కొన్నారు. 2029లో తెలంగాణలో హిందూ ప్రభుత్వం వస్తుందని, తాను హోమ్ మినిస్టర్ అవుతానని జోస్యం చెప్పారు.