VIDEO: పెదకాకానిలో జనసేన ఆవిర్భావ దినోత్సవం
GNTR: పెదకాకాని మెయిన్ సెంటర్‌లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. పొన్నూరు ఇన్‌ఛార్జ్ వడ్డానం మార్కండేయులు బాబు కేక్ కట్ చేశారు. జనసేన ప్రజల కోసం ఏర్పడిన పార్టీ అని, ప్రశ్నించడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్వతి నాయుడు, నాగబాల, బండారు మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు