గుండెపోటుతో వ్యక్తి మృతి
WGL: నల్లబెల్లి మండలం కేంద్రంలోని ముచింపుల గ్రామంలో మంగళవారం రాత్రి పులిపెద్ద నర్సయ్య గుండె నొప్పితో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందారు. ఆయన మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.