HPV వ్యాక్సిన్ గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్
AKP: గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నిరోధించే వ్యాక్సిన్(HPV)ను జిల్లాలో 14 ఏళ్లు నిండి 15ఏళ్ల లోపు గల 10,755 మంది బాలికలకు వేయనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ వ్యాక్సిన్ సింగల్ డోస్‌లో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వేస్తారని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.