అధికారులను ముందే హెచ్చరించాం: ఏటీసీ
ఢిల్లీ, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇటీవల సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. అయితే, దీని గురించి గతంలోనే అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ గిల్డ్ ఇండియా వెల్లడించింది. జూలైలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సమస్యల గురించి తెలియజేసినట్లు పేర్కొంది. అహ్మదాబాద్ ప్రమాదం అనంతరం దీనికి సంబంధించి అధికారులకు లేఖ రాసినట్లు తెలిపింది.