మర్డర్ మిస్టరీని చేధించిన పోలీసులు

మర్డర్ మిస్టరీని చేధించిన పోలీసులు

ADB: ఇటీవల ఆదిలాబాద్‌లో చోటు చేసుకున్న మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. శనివారం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ జీవన్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ఖుర్షీద్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కలిమ్... సల్మాను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా సల్మాపై అనుమానంతో బుధవారం రాత్రి హత్య చేసి తన ఆటోలో ఖుర్షీద్‌నగర్‌ సమీపంలో విసిరేసాడని తెలిపారు.