VIDEO: జనగామలో ప్రపంచ టీబీ దినోత్సవం ర్యాలీ
జనగామ జిల్లా కేంద్రంలో ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవం (మార్చి 24) సందర్భంగా “టీబీ ముక్త్ భారత్” ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించారు. నెహ్రూ పార్క్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు వెళ్లిన ర్యాలీ ద్వారా ప్రజలకు టీబీ అవగాహన కల్పించారు. పరీక్షలు నిర్వహించి టీబీ వారిని గుర్తించి చికిత్స అందిస్తామని మల్లికార్జున్ అన్నారు.