కంభం ఆర్మీ ఉద్యోగి ఇంట్లో చోరీ

ప్రకాశం: కంభం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. వెంకటేశ్వర నగర్‌లోని ఆర్మీ ఉద్యోగి రవి ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లిన సమయంలో, ఇంటి తాళం పగలగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారని. బీరువాలు పగలగొట్టి, 2 తులల బంగారం, 20 తులల వెండి, రూ.50 వేల నగదు అపహరించుకెళ్లారని రవి తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.