కాలువలో లారీ డ్రైవర్ గల్లంతు
MNCL: గరిడేపల్లి మండలం మర్రికుంట సాగర్ ఎడమ కాలువలో మంచిర్యాల వాసి ఈటె శ్రీకాంత్ గల్లంతయ్యాడు. లారీలో చెన్నై నుంచి లోడుతో బయలుదేరిన శ్రీకాంత్ ఆదివారం మర్రికుంట వద్ద వాహనం ఆపి అన్నం వండుకున్నాడు. తోటి డ్రైవర్లు, క్లీనర్లు ఈత రాకపోవడంతో కాలువ ఒడ్డున కాళ్లు చేతులు కడుక్కుంటుండగా, శ్రీకాంత్ కాలువలోకి దిగి కొట్టుకుపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు ప్రారంభించారు.