బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి: బీజేపీ

WGL: నల్లబెల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ కల్పన ఆత్మహత్యాయత్నానికి కారకులైన ఉద్యోగస్తులపై చర్యలు తీసుకోవాలని బీజేపి పార్టీ ఆధ్వర్యంలో నల్లబెల్లి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు వినయ్ మాట్లాడుతూ.. జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం సంఘటనపై విచారణ చేపట్టి నిందులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.