తక్కెళ్ళపాడులో వన సమారాధన కార్యక్రమం
NTR: నందిగామ మండలం తక్కెళ్ళపాడులో కార్తిక పాడ్యమి సందర్భంగా నిర్వహించిన వన సమారాధన భోజన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని వారి సేవాభావాన్ని ప్రశంసించారు. కార్తీక మాసం ఆధ్యాత్మికతకు, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఐక్యతను మరింత పటిష్టం చేస్తాయని ఆమె తెలిపారు.