చిన్న శేష వాహనంపై ఊరేగిన శ్రీవారు
CTR: పుంగునూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం శ్రీవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించి చిన్న శేష వాహనంపై కొలువు తీర్చారు. ఆ తర్వాత పురవీధుల్లో ఊరేగించగా మహిళలు భక్తిశ్రద్ధలతో హారతులు పట్టగా భక్తులు దర్శించుకుని శ్రీవారి కృపకు పాత్రులయ్యారు.