'చిన్నపిల్లలకు సత్వర చికిత్స అందించాలి'

'చిన్నపిల్లలకు సత్వర చికిత్స అందించాలి'

NLG: సీజనల్ వ్యాధులబారిన పడిన చిన్న పిల్లలకు సత్వర చికిత్స అందించాలని కలెక్టర్ త్రిపాఠి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. గురువారం ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. వ్యాధులకు సంబంధించి వ్యాధి నివారణ మందులు ముందే సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వ్యాధుల పట్ల రోగులకు వైద్యులు అవగాహన కల్పించాలని అన్నారు.