పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్
స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు హరిణ్యతో కలిసి ఏడడుగులు వేశాడు. హెదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లిబంధంతో ఒకటయ్యారు. ఈ వేడుకకు సినీప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.