నేడు సింగీతంలో కుస్తీ పోటీలు
SRD: రాయికోడ్ మండలంలోని సింగీతం గ్రామంలో నేడు కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు స్థానిక సర్పంచ్ శ్రావణి నిరంజన్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పోటీల్లో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మల్లయోధులు పాల్గొంటారని తెలిపారు. గెలుపొందిన విజేతలకు ఐదు తులాల వెండిని బహుకరించనున్నట్లు పేర్కొన్నారు.