పైపులైన్ నీరు వృధా.. పట్టించుకోని అధికారులు
KMR: పిట్లం మండలం చిన్న కొడఫ్గల్ గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ కారణంగా భారీగా నీరు వృధా అవుతోంది. పైపు నుంచి బయటకు వస్తున్న నీరు నిలిచిపోయి అశుద్ధజలం చేరే ప్రమాదం ఉందని, దీనివల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.