అభివృద్ధి పనులను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే

MNCL: మందమర్రి పరిధిలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే డా. వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ప్రతి వార్డులో రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి లైట్లు వంటి అభివృద్ధి పనులను ఆయన సమీక్షించారు. పరిశీలన సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని తెలిపారు.