నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: గుంటూరులోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈఈ పి.హెచ్. ఖాన్ తెలిపారు. నందివెలుగు రోడ్డు, రాహుల్ గాంధీనగర్, జియావుద్దీన్ నగర్, షాప్ ఎంప్లాయిస్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, పోలీస్ కాలనీ ప్రాంతాల్లో ఈ విద్యుత్ నిలిపివేత ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.