సింగరకొండలో వైభవంగా హనుమత్ వ్రతం
BPT: అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం హనుమత్ వ్రతం వైభవంగా నిర్వహించారు. హనుమాన్ దీక్షాపరులు ఇరుముడులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. అనంతరం స్వామివారికి ఇరుముడులు సమర్పించుకున్నారు. పలు జిల్లా నలుమూలల నుంచి భక్తుల పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకుని హనుమత్ వ్రతం పూజలు చేశారు.