మాదాపూర్‌లో సందడి చేసిన నటి లయ

మాదాపూర్‌లో సందడి చేసిన నటి లయ

HYD: ప్రముఖ నటి లయ ఆదివారం మాదాపూర్‌లోని మినర్వా హాల్స్‌లో సందడి చేశారు. మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ ఆధ్వర్యంలో 'మిల్లెట్ మదర్స్' కార్యక్రమాన్నిఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిల్లెట్స్ వాడకం వల్ల షుగర్, రక్తపోటు సమస్యలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గర్వంగా ఉందన్నారు.