నాగులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NTR: జీ. కొండూరు మండలం నాగులూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ధాన్యం విక్రయించిన గంటల వ్యవధిలోనే అన్నదాతలకు విక్రయ సొమ్మును చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ సీనియర్ నేత విజయబాబు జన్మదిన వేడుకల కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి, తదితరులు పాల్గొన్నారు.