పాక్ అదుపులో 8 మంది భారత జాలర్లు
భారత్‌కు చెందిన 8 మంది మత్స్యకారులను పాక్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుగురు గుజరాత్ జూనాగఢ్‌కు చెందిన వారు ఉండగా.. మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తి ఉన్నాడు. వీరంతా ప్రయాణిస్తున్న పడవ గత రాత్రి సముద్రంలోని నో-ఫిషింగ్ జోన్‌లోకి ప్రవేశించడంతో పాక్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరితో కలిపి మొత్తం 125 మంది గుజరాతీలు పాక్ అదుపులో ఉన్నారు.