'పెన్షన్ పంపిణీ ఘనత కూటమి ప్రభుత్వానిదే'
E.G: నల్లజర్ల మండలం అనంతపల్లిలో శనివారం జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జమ్ముల సతీష్ పాల్గొన్నారు. లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, వెలుగు సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.