VIDEO: కారును ఢీ కొట్టిన బైక్..!
MDK: మెదక్ పట్టణంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయం ఎదుట రోడ్డుపక్కన ఆగి ఉన్న కారును ద్విచక్ర వాహనదారుడు మద్యం మత్తులో అదుపు తప్పి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. కారు ముందు భాగం దెబ్బతినగా, ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించి ఉండటంతో వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.