తడిచిన పత్తి బస్తాలపై తుమ్మల క్లారిటీ
TG: వరంగల్‌లో పత్తి సంచులు తడిచిన ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న వచ్చిన భారీ వర్షానికి ఎనుమాముల మార్కెట్‌లో రైతులు అమ్మకానికి తీసుకుని వచ్చిన పత్తి మొత్తం బస్తాలు 7,329 ఉంటే.. వాటిలో కేవలం 59 బస్తాలు మాత్రమే తడిచినట్లు నివేదికలో తేలిందని పేర్కొన్నారు. తడిచిన పత్తిని సిబ్బంది సాయంతో ఆరబెట్టి కొనుగోలు చేసినట్లు తెలిపారు.