'వంగవీటి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తా'
NTR: వంగవీటి రంగా ఫ్యామిలీలో నుంచి మరో ఎంట్రీ జరగనుంది. ఆదివారం వంగవీటి ఆశ కిరణ్ విజయవాడలోని తన తండ్రి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇకనుంచి తాను ప్రజా జీవితంలోకి రాబోతున్నానని తెలిపారు. వైసీపీ ఆహ్వానంపై తాను ఇప్పుడే స్పందించబోనని అన్నారు. వంగవీటి రంగా ఆశయాలను తాను ముందుకు తీసుకువెళ్తానని స్పష్టం చేశారు.