వేములపూడిలో పోషణ పక్వాడ కార్యక్రమం

వేములపూడిలో పోషణ పక్వాడ కార్యక్రమం

AKP: నర్సీపట్నం ఐసీడీఎస్ సీడీపీఓ జి.వి. రమణి ఆధ్వర్యంలో గురువారం వేములపూడి గ్రామంలో పోషణ పక్షవాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కార్మికులకు అవగాహన కల్పిస్తూ చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం వల్ల కంటి చూపు, మెదడు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపారు. పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదలకు పోషకాహారం అవసరమన్నారు.