ప్రమాదానికి ముందు పైలట్ మరో వీడియో వైరల్
దుబాయ్ ఎయిర్ షో కార్యక్రమంలో ప్రదర్శన సమయంలో భారత యుద్ద విమానం తేజస్ ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విమానం పైలట్ మృతి చెందారు. అయితే ఈ ప్రదర్శనకు ముందు వింగ్ కమాండర్ నమాన్ష్ సియాల్‌కు సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నమాన్ష్ నవ్వుతూ విమానంలోకి వెళ్లాడు. కాగా పైలట్ కుటుంబాన్ని ఆదుకుంటామని IAF హమీ ఇచ్చింది.