ధర్మవరంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న 52 మందికి రూ. 26,66,373 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎంఆర్‌ఎఫ్, ఎల్ఓసీల నుంచి మొత్తం రూ. 8.61 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు మంత్రి వెల్లడించారు.