బొమ్మల మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే
NTR: కొండపల్లిలో శనివారం నిర్వహించిన బొమ్మల మేళాను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొండపల్లి బొమ్మలు కేవలం వస్తువులు మాత్రమే కావని, అవి మన చరిత్రకు, వారసత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ హస్తకళను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.