ప్రమాదం.. ప్రేమ జంట మృతి

ప్రమాదం..  ప్రేమ జంట మృతి

AP: కొద్ది రోజుల్లో ఒక్కటి కావాల్సిన ప్రేమ జంట పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చికి వెళ్లి వస్తుండగా.. ఓబులేశుని పల్లె వద్ద వీరి బైక్ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్, సోఫియా అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్రీస్తు మాల విసర్జన కోసం వెళ్లి వస్తుండగా మృత్యువు కబళించింది. ఈ ఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.