'మతోన్మాదుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలి'

'మతోన్మాదుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలి'

NTR: మతోన్మాదుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపినాయక్ అన్నారు. నందిగామ మండల కమిటీ ఆధ్వర్యంలో 79 మీటర్ల జాతీయ జెండాతో అజాది ర్యాలీ నిర్వహించారు. తెల్ల దొరల నుంచి దేశ స్వాతంత్య్రం కోసం అసువులుబాసిన అమరుల స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. వారు కలలుగన్న స్వాతంత్రం నేడు పాలకులు వంచిస్తున్నారని వాపోయారు.