ఈ నెల 26 నుంచి పథకాలు అమలు: కలెక్టర్

MBNR: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ఈనెల 26 నుంచి ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ విజయేంద్రిర బోయి సోమవారం తెలిపారు. ఈనెల 16 నుంచి 20 వరకు పరిశీలన, ఈనెల 21 నుంచి 24 వరకు జాబితాను గ్రామ సభలో చదివి వినిపించడం, 21 నుంచి 25 వరకు డాటా ఎంట్రీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.