ఏరులై పారుతున్న మద్యం..!

ఏరులై పారుతున్న మద్యం..!

MBNR: పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ దగ్గర పడుతుండటంతో జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కాసుల వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటినుంచే ఓటర్లు తమ వైపు ఉండేలా మద్యం ఏరులై పారిస్తున్నారు. జనరల్ స్థానాల్లో ఈ పోటీ మరింత తీవ్రంగా ఉంది. కొంతమంది అభ్యర్థులైతే 'అప్పు ఎంతైనా పర్వాలేదు కానీ గెలవాలంతే' అనే ధోరణితో ముందుకెళ్తున్నారు. మరి మీ ఊర్లో ఇలానే ఉందా ?