బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. ఉపాధ్యాయుడు సస్పెండ్
సత్యసాయి: మడకశిర మండలం హరే సముద్రం జెడ్పీ ఉన్నత పాఠశాలలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గణిత ఉపాధ్యాయుడు నరసింహ మూర్తిని సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి క్రిష్టప్ప తెలిపారు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, విచారణలో ఆరోపణలు వాస్తవమని తేలింది. ఈ మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసేలా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎంఈవోకు సూచించారు.