శ్యామలాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ
E.G: రాజమండ్రి మంగళవారపు పేటలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్యామలాంబ అమ్మవారిని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్ కడియాల వీరభద్ర రావు, టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు మర్యాదపూర్వకంగా ఆమెను ఆహ్వానించారు. దర్శనంతరం అమ్మవారి చిత్రపటాన్ని ఎంపీకి బహుకరించారు.