ఈతకు వెళ్లి చెరువులో వ్యక్తి గల్లంతు

HYD: కౌకుర్ దర్గా వద్ద ఈతకు వెళ్లి చెరువులో వ్యక్తి గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. ఫలక్‌నూమాకు చెందిన మహమ్మద్ గౌస్(35) అనే వ్యక్తి కౌకూర్ దర్గాను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నాడు. స్నానం చేసేందుకు చెరువులోకి దిగి ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. 24 గంటలు గడిచిన అతడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం డీఆర్ఎఫ్ ఫైర్, స్థానిక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.