ఇకపై రాజ్‌భవన్ కాదు.. లోక్‌భవన్
TG: రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్ పేరు లోక్‌భవన్‌గా మారింది. ఇకపై రాజ్‌భవన్‌ను లోక్‌భవన్‌గా పిలవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కార్యాలయం తెలిపింది. గవర్నర్ల అధికారిక నివాసాల పేర్లను లోక్‌భవన్‌గా మారుస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాజ్‌భవన్ ప్రవేశద్వారం గోడపై లోక్‌భవన్ అనే అక్షరాలను మార్చారు.