సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
VZM: కలెక్టర్ రామసుందర్ రెడ్డి మంగళవారం బొబ్బిలి మండలంలోని సాయినగర్ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఆయన అక్కడి పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. సచివాలయంలో సిబ్బంది హాజరు, వివిధ శాఖల సేవల అమలు, రికార్డు నిర్వహణ, ప్రజలు పొందే సంక్షేమ పథకాల స్థితిగతులపై ఆరా తీశారు. సిబ్బందికి సేవ దృక్పథం చాలా అవసరమని, ప్రజల పట్ల మర్యాద పూర్వకంగా నడుచుకోవాలన్నారు.