'నేరాల నియంత్రణలో సాంకేతికతను జోడించాలి'

'నేరాల నియంత్రణలో సాంకేతికతను జోడించాలి'

సూర్యాపేట నేర పరిశోధనలో సాంకేతికతను జోడించి నేరస్తులకు త్వరగా శిక్షలు పడేలా చూడాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారీ సమీక్ష నిర్వహించారు. మహిళలు, పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. ‘అరైవ్ అలైవ్’ ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. అదనపు ఎస్పీ రవీందర్ ఉన్నారు.