ఓపెనర్‌గా మారిన అర్జున్ టెండూల్కర్
క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు అర్జున్ దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్నాడు. గోవా జట్టు తరఫున ఆడుతున్న అతడు, సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నీలో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. గతంలో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అర్జున్, ఇప్పుడు ఏకంగా ఓపెనర్ అవతారం ఎత్తాడు. ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న అతడు, వచ్చే IPLలో LSG తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.