సీఎం సభ వేదికను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యేలు

WNP: వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరగనున్న సీఎం బహిరంగ సభ వేదికను ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఏర్పాట్లను నేతలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ పట్టణ జిల్లా నేతలు పాల్గొన్నారు.