హోంమంత్రి ఆదేశాలతో వేసవి కార్యాచరణ సిద్ధం
GNTR: రానున్న వేసవిని ఎదుర్కొనేలా ముందస్తు చర్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై స్పందించిన గుంటూరు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా జిల్లాలో వేసవి కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తాగునీరు, వైద్యం, అగ్నిమాపక సేవల కోసం రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు.