రోడ్డు పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే

ATP: అనంతపురం-తగరకుంట రోడ్డు పనులను మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. గతంలో కాంట్రాక్టర్లను బెదిరించడంతో పనులు నిలిచిపోయాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరమ్మతులు పునఃప్రారంభమయ్యాయని చెప్పారు. అత్యంత సమస్యగా ఉన్న 8కి.మీ రహదారి 3 నెలల్లో సిద్ధమవుతుందని అధికారులు హామీ ఇచ్చారు.