ప్రపంచకప్ విజేతలకు బహుమతిగా TATA కార్లు

ప్రపంచకప్ విజేతలకు బహుమతిగా TATA కార్లు

వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు పెద్ద ఎత్తున బహుమతులు అందుతున్నాయి. ఇప్పటికే, భారత జట్టులోని సభ్యులందరికీ సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి డైమండ్ నెక్లెస్‌లను బహుమతిగా ప్రకటించారు. తాజాగా, ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'టాటా మోటార్స్' కూడా జట్టు సభ్యులందరికీ కార్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.