బెంగళూరులో బలిజపల్లె వాసి మృతి

చిత్తూరు: గంగాధరనెల్లూరు మండలం బలిజపల్లెకు చెందిన సీకే బిందు బెంగళూరులో ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్లు సన్నిహితులు తెలిపారు. ఈ మేరకు గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు. ఈమెకు ఐదేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు.