ఆదోని మార్కెట్‌లో పత్తి క్వింటా రూ. 8,229

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి క్వింటా గరిష్టంగా రూ. 8,229 పలికింది. ధర నిలకడగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కనిష్ట ధర రూ. 4,666 పలికిందని అధికారులు తెలిపారు. వేరుశనగ గరిష్ట ధర రూ. 7,053, కనిష్ట ధర రూ. 3,169 పలికింది. మోసాలపై రైతులు ఫిర్యాదు చేస్తే ఏజెంట్, వ్యాపారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.