'గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి'

'గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి'

NLG: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని వేములపల్లి ఎస్సై  డి.వెంకటేశ్వర్లు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని వినాయక ఉత్సవాలు జరుపుకునే నిర్వాహకులు పోలీస్ శాఖ నుంచి అనుమతులు పొందాలన్నారు. విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.