'కూటమి నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి'

PPM: జీవో నం. 3 విషయంలో గత ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని.. ఆ తర్వాతే డీఎస్సీ నిర్వహించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర కోరారు. నూరుశాతం గిరిజనులకు పోస్టులు రావాలంటే.. వారికోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు తర్వాత సీఎం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.